News

భజరంగ్ దళ్ కార్యకర్తను హత్య చేసింది ముస్లిం గుండాలే…

409views
  • కర్ణాటక మంత్రి ఈశ్వ‌ర‌ప్ప ఆరోప‌ణ‌

బెంగ‌ళూరు: శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను ముస్లిం గూండాలే హత్య చేశారని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను క‌త్తుల‌తో పొడిచి చంపారని చెప్పారు. హిజాబ్ నిరసనల వ్యాఖ్యలే హత్యకు ప్రేరేపించాయ‌ని మంత్రి ఆరోపించారు. డీకే శివకుమార్ ముస్లిం గూండాలను రెచ్చగొట్టారని ఆరోపించారు.

భజరంగ్ దళ్ కార్యకర్త హత్య అనంతరం పోలీసు భద్రతను పెంచారు. కళాశాలలు, పాఠశాలలను మూసివేశారు. ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. హత్య వెనుక ఉన్నవారిని ఇంకా గుర్తించలేదని, కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. కేసులో ఆధారాలు కనుగొన్నామని, త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి