News

ముస్లిం తీవ్రవాదులు వ్యాప్తి చేసే విష ఫలితమే హ‌ర్ష హ‌త్య‌!

762views
  • వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్

న్యూఢిల్లీ: కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం (ఫిబ్రవరి 20) జ‌రిగిన 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ముస్లిం తీవ్రవాదులు ప్రతిరోజూ వ్యాప్తి చేసే విష ఫలితమే ఈ హత్య అని పేర్కొంది.

శివమొగ్గలో తరగతి గదుల్లో బురఖాను వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ రాసినందుకు ఇస్లాంవాదులు హర్షను హత్య చేసిన విష‌యం విదిత‌మే.

వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి విషాన్ని వ్యాపింపజేస్తోందని అన్నారు. ఉగ్రవాద సంస్థ సిమికి కొత్త వెర్షన్ అయిన పిఎఫ్‌ఐ వంటి ఇస్లామిక్ సంస్థలు సిఎఎ, నమాజ్, బురఖా మొదలైన వాటి సాకుతో ప్రతిరోజూ విషాన్ని చిమ్ముతున్నాయ‌ని ఆరోపించారు.

“నేను ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను…1947కి ముందు జిన్నా తమను తీసుకెళ్లాలనుకున్న దిశలో వెళ్ళాలనుకుంటున్నారా? అలాకాదంటే, మీరు మీ నాయకత్వాన్ని మార్చుకోండి… త‌ద్వారా మీ స‌మాజానికి గొప్ప మార్గాన్ని చూపించండి. ఈ ప‌ని మీరు చేయకపోతే, మేమే చేయాల్సి వ‌స్తుంది” అని డాక్ట‌ర్ జైన్ అన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి