
481views
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
వీరు తీవ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు(ఎల్ఈటీ)కు చెందిన ఉగ్రవాదులని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ఒకరిని ఇఖ్లాక్ హజామ్‌గా గుర్తించారు. హసన్‌పోరా, అనంత్‌నాగ్‌లో ఇటీవల జరిగిన హెచ్.సీ అలీ మహ్మద్ హత్యలో హజామ్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి నుంచి రెండు పిస్టల్స్ సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
Source: EtvBharat





