
575views
న్యూఢిల్లీ: 90 దేశాలకు భారత్ కొవిడ్ టీకాలు పంపించినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. దిల్లీ వేదికగా జరుగుతున్న 3వ భారత్- సెంట్రల్ ఆసియా సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు కిరిగిస్థాన్ విదేశాంగ మంత్రి రుస్లాన్ కజక్బావ్, తజకిస్థాన్ విదేశాంగ మంత్రి సిరోజిద్దిన్ ముహ్రిద్దిన్, కజకిస్థాన్ మంత్రి ముఖ్తార్ తిలియుబెర్ది సహా పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.





