News

యూపీలో విస్తరిస్తున్న జికా వైరస్

744views
  • కట్టడికి యోగీ సర్కార్ చర్యలు

ల‌క్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 105కి చేరింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతుండడంతో యూపీ ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం కాన్పూర్‌లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా జిల్లా అధికార యంత్రాగంతో సమావేశం నిర్వహిస్తారు. ఇందులో వైరస్​ సంక్రమణను నివారించడానికి మార్గదర్శకాలను కూడా జారీ చేయనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి