News

భారత నౌకాదళాధిపతిగా హరికుమార్

574views

న్యూఢిల్లీ: భారత నౌకదళ తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న ప్రస్తుత భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అదే రోజున వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి