News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఐదుగురి గ్రామీణుల కిడ్నాప్

506views
  • మావోయిస్టుల దుశ్చ‌ర్య‌

సుక్మా: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా కొంటా బ్లాక్​లోని క్వాయిల్ గ్రామానికి చెందినవారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం కలిగించి, భయపెట్టేందుకే మావోలు ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్​పై వేగంగా దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామస్థులను వదిలిపెట్టాలని సర్వా ఆదివాసీ సొసైటీ డిమాండ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి