News

కరోనా కొత్త వేరియంట్‌తో ఆందోళ‌న లేదు

561views
  • స్ప‌ష్టం చేసిన హోంశాఖ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తిపై జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం కీలక ప్రకటన చేసింది. భారత్​లో ఏవై.4.2 వ్యాప్తి 0.1 శాతం కంటే తక్కువ ఉందని, ఆందోళన చెందాల్సినంత వ్యాప్తి లేదని స్పష్టం చేసింది. జీనోమ్​ వేరియంట్లపై పర్యవేక్షించేందుకు జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం​ను 2020 డిసెంబర్​లో ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి