News

వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా: ప్రధాని మోదీ

47views

వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ  వెల్లడించారు. కుంభమేళా నిర్వహణకు వీలుగా ‘దేవ్‌భూమి’ని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని..పుణ్యస్థలాల్లో ప్రజలు కూడా పరిశుభ్రతను పాటించాలని సూచించారు. భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు ప్రతిబింబించేలా కుంభమేళాను పరిశుభ్రంగా, వైభవంగా జరుపుకొందామన్నారు.భారతదేశ ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద ప్రతిబింబించే ఈ వేడుకను పరిశుభ్రతతో పాటు వైభవంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా భక్తులు ఆసక్తిగా ఎదురు చూసే మినీ చార్‌ధామ్‌ యాత్ర కూడా మరికొన్ని నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో భక్తుల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయన్నారు. దిల్లీ-దెహ్రాదూన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల వృద్ధిపై దృష్టిపెట్టినట్లు తెలిపారు.