News

భారత మత్స్యకారులపై పాకిస్తాన్ భద్రతాదళాల కాల్పులు

456views

గాంధీన‌గ‌ర్‌: భారత మత్స్యకారులపై పాకిస్థాన్​ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ గుజరాత్​ తీరంలోని అంతర్జాతీయ మారిటైం సరిహద్దు రేఖ వద్ద కాల్పులు జరిపింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన శ్రీధర్​ రమేశ్ చమ్రే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల సమయంలో పడవలో ఏడుగురు ఉన్నట్టు దేవ్​భూమి ద్వారక ఎస్పీ సునీల్ జోషీ తెలిపారు.

వీరిలో ఐదుగురు గుజరాత్​కు చెందినవారు కాగా ఇద్దరు మహారాష్ట్ర జాలర్లని వివరించారు. ఈ ఘటనపై ఇండియన్ కోస్ట్​ గార్డ్​(ఐసీజీ) స్పందించింది. కేసు దర్యాప్తులో ఉందని త్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. పడవలోని మరో ఆరుగురు జాలర్లను అరెస్ట్​ చేశామన్న పాక్​ ప్రకటనను ధ్రువీకరించలేదని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి