News

మహిళలను లైంగికంగా వేధిస్తూ, వీడియోలు తీస్తున్న జిమ్ ట్రైనర్ అరెస్ట్

12views
సూరత్ లోని పాల్ ప్రాంతంలో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రలోభాలకు గురిచేసి, ప్రేమలోకి దింపిన జిమ్ ట్రైనర్ సబీర్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా, అభ్యంతరకరమైన వీడియోలు తీసి, డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా ఒక్కొక్కర్ని 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసేవాడు.
క్రమం తప్పకుండా జిమ్ కి వచ్చే మహిళలు, యువతులతో పరిచయం చేసుకోవడం, క్రమంగా వారిని వలలో వేసేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా, వారి అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలను కూడా సబీర్ రికార్డులు చేసేవాడని పేర్కొంటున్నారు. ఆ తర్వాత ఆ వీడియోలను బాధితురాలికి, వారి కుటుంబీకులకు పంపి, బ్లాక్ మెయిల్ చేసేవాడని పేర్కొంటున్నారు.
అయితే.. ఇందులోంచి ఓ మహిళ.. తన భర్తకి ఈ ఉదంతాన్ని చెప్పడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత పోలీసులను సంప్రదించి, నిందితుడిపై ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన సూరత్ పోలీసులు జిమ్ ట్రైనర్ సబీర్ అన్సారీని అరెస్ట్ చేశారు.
ఇక.. ఈ జిమ్ ట్రైనర్ల విషయంలో తరుచుగా ఇలాంటి సంఘటనలే బయటకు వస్తున్నాయి. దీంతో హిందూ మహిళల భద్రత గురించి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇటీవలే అనేక సంఘటనలు కూడా జరుగుతున్నాయి.