
756views
లక్నో: ఉత్తర్ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్నగర్లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, గవర్నర్ అనందీబెన్ పటేల్లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య కళాశాలలు ప్రారంభించడం చిన్న విషయం కాదని, వర్ధమాన, భవిష్యత్తు తరాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర వైద్య శాఖా మంత్రి అభిప్రాయపడ్డారు.





