News

చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ

470views
  • పర్యాటక ప్రాంతాల మూసివేత

  • ఎప్పటిలాగానే వివరాలు దాస్తున్న కిలాడి డ్రాగన్

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్ పడగవిప్పుతోంది. ఇప్పటికే వైరస్​ను నియంత్రించేందుకు అనేక ఆంక్షలను అమలు చేస్తున్న డ్రాగన్.. తాజాగా ఓ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మూసేసింది. కొత్త కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గాన్సు రాష్ట్రంలోని బౌద్ధ మందిరాలు, ప్రఖ్యాత ప్రార్థనా స్థలాలను మూసేసింది. ఎప్పటి లాగానే చైనా కేసుల విషయంలో దొంగ లెక్కలు చెప్తూ ప్రపంచాన్ని ఏ మారుస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35 కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆ దేశ జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. ఇందులో నాలుగు గాన్సు నుంచే ఉన్నట్లు తెలిపింది. 19 కేసులు ఇన్నర్ మంగోలియాలో వెలుగుచూసినట్టు పేర్కొంది. దీంతో ఇన్నర్ మంగోలియాలోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి