News

సైనికుల ధైర్యసాహసాలు భేష్‌

606views
  • జమ్ముకశ్మీర్‌ పర్యటనలో హోంమంత్రి అమిత్‌ షా

జమ్ముకశ్మీర్‌: మూడు రోజుల జమ్ముకశ్మీర్‌ పర్యటనలో ఉన్న షా అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లను కలిశారు. సైనికులు ఆందోళనలు లేకుండా దేశాన్ని రక్షించాలని, వారి కుటుంబసభ్యుల క్షేమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చూసుకుంటుందని హామీనిచ్చారు. జవాన్ల కోసం కానుకలు కూడా తీసుకెళ్లారు. సైనికులకు పండ్లు అందించిన షా సరిహద్దులో జవాన్లతో మాట్లాడారు.

భద్రతా దళాల ధైర్యసాహసాలకు దేశ ప్రజల తరఫున నేను సెల్యూట్‌ చేస్తున్నా. కృతజ్ఞతలు తెలుపుతున్నా. సరిహద్దులను రక్షిస్తున్న మీకు, మీ కుటుంబాల సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సరిహద్దులోని చివరి గ్రామమైన మక్వాల్‌ను కూడా షా సందర్శించారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అక్కడి ప్రజలకు వెల్లడిరచారు. దేశ రాజధాని దిల్లీలో నివాసముంటున్న ప్రజలకు ఎన్ని హక్కులున్నాయో.. వాటికి సమానంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు కూడా హక్కులు ఉన్నాయని షా తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో మొదలైన అభివృద్ధికి ఎవరూ అడ్డుపడలేరని అభిప్రాయపడ్డారు. సరిహద్దు గ్రామంలోని ఓ స్థానికుడి గృహాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘వివక్షపూరిత’ ఆర్టికల్‌ 370 రద్దు మోదీ వల్లే సాధ్యమైందని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ కలలను సాకారం చేసేందుకు నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టి పనిని పూర్తి చేశారన్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్ముకలో తొలిసారి బహిరంగ సభ నిర్వహించారు షా. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య విలువలను మోదీ పునరుద్ధరించారన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి