News

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్, ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల మృతి

658views

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారత భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. జమ్మూలోని షోపియన్‌ జిల్లా డ్రాగడ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య కాల్పులు సంభవించాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించినట్టు పోలీసులు తెలిపారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసులు చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.