
-
ప్రధాని నరేంద్ర మోదీ
కుషినగర్(ఉత్తర ప్రదేశ్): రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, సీప్లేన్‌ల కోసం వాటర్‌డ్రోమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం ప్రారంభించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఉడాన్(ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకం కింద, గత కొనేళ్ళుగా 900కి పైగా కొత్త ఎయిర్ రూట్‌లకు ఆమోదం లభించిందని, వీటిలో 350కి పైగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. ‘50కి పైగా కొత్త విమానాశ్రయాలు లేదా ఇంతకు ముందు సేవలో లేనివి, కార్యాచరణ చేయబడ్డాయి’ అని అన్నారాయన.
జూన్ 2020లో ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Source: Organiser





