
-
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
గాంధీనగర్: దేశాన్ని మోసం చేసే వారు ఎంతటి బలవంతులైనా వదిలిపెట్టేది లేదని, అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిబిఐ, సీవీసీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 6-7 సంవత్సరాలుగా తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో అవినీతికి తావులేదని నిరూపించినట్లుగా ఆయన వెల్లడించారు. అవినీతిపరులు తప్పించుకోలేరని ఇప్పుడు దేశం నమ్ముతోందని అభిప్రాయపడ్డారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సంయుక్త సమావేశానికి గుజరాత్ నుంచి వర్చువల్‌గా హాజరైన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మనం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని ప్రధాని గుర్తు చేశారు.
రాబోయే 25 ఏళ్ళలో అంటే ఈ అమృత కాలంలో స్వయం-ఆధారిత భారతదేశం భారీ తీర్మానాల నెరవేర్చుకునే వైపుగా దేశం ముందుకు కదులుతోందన్నారు. నేడు దేశాన్ని మోసం చేసేవారు. చిన్నదైనా, పెద్దదైనా అవినీతి అంటే మరొకరి హక్కుల్ని హరించడమే.. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుందని ప్రధాని అన్నారు. జాతి పురోగతికి ఇలాంటివి ఆటంకంగా మారుతాయన్నారు.
Source: Tv9





