
-
భారీ పేలుడు కుట్ర భగ్నం
చండీగఢ్: పంజాబ్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. తార్న్‌తారన్‌లోని భికివిండ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోగలిగారు. వారి నుంచి రెండు టిఫిన్ బాక్సు బాంబులు, రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, మూడు తొమ్మిది ఎంఎం పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెలరోజుల వ్యవధిలో పంజాబ్‌లో రికవరీ చేసిన ఆరో టిఫిన్ బాంబు ఇది.

ఉత్తరప్రదేశ్‌లో ఉగ్ర కుట్ర
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్టు యూపీ తీవ్రవాద వ్యతిరేక దళం, జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించాయి. దావూద్ ఇబ్రహీం అనుచరులు 2019 డిసెంబర్‌లో.. రాష్ట్రంలోని మతపరమైన స్థలాల్లో రెక్కీ నిర్వహించినట్టు కనుగొన్నాయి.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు.. రెక్కీ సమయంలో వీరంతా కాన్పుర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్టు గుర్తించాయి. వారికి సహాయంగా బిహార్‌కు చెందిన ఇద్దరు ఆయుధాల స్మగ్లర్లు, ఓ మహిళ కూడా ఉన్నట్టు లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ వివరించారు.
Source: EtvBharat





