
-
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారిస్ ఆరోపణ
వాషింగ్టన్ డిసి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా.. ఉగ్రవాదంలో పాకిస్థాన్ పాత్రను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రస్తావించారు. ఉగ్రవాద ముఠాలకు ఇస్లామాబాద్ మద్దతు, సాయంపై పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ భేటీలో అంశాలను విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా వివరించారు. భేటీలో..ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారని తెలిపారు. కొవిడ్ మహమ్మారి రెండో దశ నుంచి భారత్ వేగంగా కోలుకుందని కమలా హారస్ చెప్పినట్టు వెల్లడిరచారు.
ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీ, అత్యవరమైన ఔషధాల, ఆరోగ్య పరికరాల సరఫరా వంటి విషయాలపై మోదీ, హారిస్ చర్చించారు. పర్యావరణ మార్పులపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇందులో భాగంగా భారత్ తీసుకుంటున్న చర్యలను హారిస్‌కు వివరించారు మోదీ. పునరుత్పాదక ఇంధనానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, జాతీయ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.





