News

భారత సైన్యంలో అర్జున్‌ యుద్ధ టాంకులు

750views
  • కొనుగోలుకు రక్షణశాఖ సన్నాహం

న్యూఢిల్లీ: 118 ఎమ్‌బీటీ(మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్స్‌) అర్జున ట్యాంకులు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. ట్యాంకుల కొనుగోలుకు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణశాఖ. రూ. 7,523కోట్లుకు చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్‌ ఫ్యాక్టరీకి అర్జున ఎమ్‌కే-1ఏ కోసం ఆర్డర్లు ఇచ్చింది రక్షణశాఖ. ఇందులో అత్యాధునిక సాంకేతికత ఉంటుంది. ఎమ్‌కే-1 వేరియంట్‌తో పోల్చుకుంటే ఇందులో 72 ఫీచర్లు అదనంగా ఉండనున్నాయి. ఏ ప్రదేశంలోనైనా సులభంగా ప్రయాణించే వెసులుబాటు యుద్ధ ట్యాంకుల్లో ఉంది. రక్షణ రంగంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఈ ఆర్డర్లు మరింత ఊతమందిస్తాయని రక్షణశాఖ ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి