
-
చివరి క్షణంలో క్రికెట్ సీరిస్‌ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్
వెల్లింగ్టన్: పాపాల పాకిస్తాన్‌కు అన్ని వైపుల నుంచి దెబ్బ మీద దెబ్బె తగులుతోంది. అయినా… గుణపాఠం నేర్చిందా… అంటే అదీ లేదు. దుర్మార్గులను దండించాల్సింది పోయి, అండగా నిలుస్తోంది. తల్లిలాంటి భారతదేశంపై కాలుదువ్వుతోంది… ఈ వైఖరి వల్లే లోకమంతా పాకిస్తాన్ అంటే ఛీ కొడుతోంది. తాజాగా, దాదాపు ఇదే జరిగింది.
ఈ రోజు నుంచి పాకిస్తాన్‌లోని రావల్పిండిలో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లు ప్రారంభం కావల్సివుంది. అయితే, భద్రతా వైఫల్యాలను కారణంగా చూపి వైట్ బాల్ సిరీస్‌ను న్యూజిలాండ్ రద్దు చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. ఇప్పుడు అనుకోకుండా పర్యటన రద్దు కావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు షాక్‌కి గురైంది. తీవ్ర నిరాశలో మునిగింది.
ఇరుజట్ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ సిరీస్‌కి ఆది నుంచి ఆటంకాలు మొదలయ్యాయి. మొదటగా రెండు జట్లకు సంబంధించిన కీలక ఆటగాళ్లు గాయలపాలయ్యారు. తర్వాత ఐపీఎల్ వల్ల ఈ సిరీస్‌కి DRS System (Decision Review System) సిస్టమ్ అందుబాటులో లేదు. ఇప్పుడు భద్రత కారణంగా సిరీస్ రద్దు చేశారు. అయితే, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో విధంగా చెబుతున్నారు. ఇతర విజిటింగ్ టీమ్‌ల మాదిరిగానే న్యూజిలాండ్‌కు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లను కొనసాగించడానికి PCB ఇప్పటికి సిద్ధంగా ఉందన్నారు.
మొత్తమ్మీద సీరిస్ రద్దుతో మాజీ క్రికెట్ ప్లేయర్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాక్ ముఖం మాడ్చుకొని ఉంటారు.

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మాట్లాడుతూ.. మిలియన్ల మంది పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు చిరునవ్వులు తిరిగి తెచ్చే ఈ సిరీస్ రద్దు కావడంతో అందరు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నాడు. మా సెక్యూరిటీ ఏజెన్సీల సామర్థ్యాలు విశ్వసనీయతపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నాడు. 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడుల తరువాత అంతర్జాతీయ క్రికెట్‌ని దేశంలో తిరిగి పునరుద్ధరించడానికి PCB విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన రద్దు వచ్చే నెలలో ఇంగ్లాండ్ సిరీస్‌పై కూడా ప్రభావం చూపవచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Source: Tv9





