
-
అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత
న్యూఢిల్లీ: తాలిబాన్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్ను చంపేశారు. తొలుత పంజ్‌షీర్‌లో తమకు పట్టుబడిన రోహుల్లా అమ్రుల్లా సలేహ్ను తొలుత కొరడాలు, విద్యుత్ వైర్లతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఆయన గొంతు కోసి.. తర్వాత బుల్లెట్ల వర్షం కురిపించారు. రోహుల్లా సలేహ్ పంజ్‌షీర్ నుంచి కాబూల్‌కు వెళుతుండగా తాలిబాన్లకు చిక్కాడనే ప్రచారం సాగుతోంది. పంజ్ షీర్ లోయలో రోహుల్లా సలేహ్ చెందిన గ్రంథాలయం ఇప్పుడు తాలిబాన్ ముష్కరుల వశమైంది. ఈ గ్రంథాలయంలోకి తమ సాయుధులు ప్రవేశించిన ఫొటోలను తాలిబన్ వర్గాలు విడుదల చేశాయి. దాంతో రోహుల్లా సలేహ్ మరణించారన్న విషయం దాదాపు నిర్ధారణ అయింది. ఆఫ్ఘన్‌లో మీడియాపై తీవ్ర ఆంక్షలు ఉండడంతో పంజ్ షీర్ లోయలో ప్రస్తుత పరిస్థితి ఏంటన్నదానిపై స్పష్టతలేదు.
Source: NationalistHub





