News

ఉత్తరాఖండ్‌లో భూకంపం

677views
  • తెల్లవారుజామున సంఘ‌ట‌న‌

  • ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్ళ నుంచి పరుగులు పెట్టారు. ఆ రాష్ట్రంలోని జోషీమఠ్‌లో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.6గా నమోదయినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. జోషిమఠ్‌కు 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపల్‌కోటి వద్ద ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు వెల్లడిరచింది.

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 5.58 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. ఈ సమయంలో జోషిమఠ్‌లో భవనాలు స్వల్పంగా కదిలాయని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా.. దీని ప్రభావం చుట్టుపక్కల రాష్ట్రాలపైనా కనిపించిందని, పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు.

 

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి