News

హక్కుల కోసం రోడ్లపైకి ఆఫ్ఘన్ మహిళలు

718views
  • పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నిరసనలు

న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌లోని మ‌హిళ‌లు త‌మ పోరాటాల‌ను ఉద్ధృతం చేశారు. హ‌క్కుల కోసం రోడ్ల‌పై వ‌చ్చిన నిర‌స‌న తెలుపుతున్నారు. తాలిబన్ల నిరంకుశ వైఖరితో ఇప్ప‌టికే విసిగిపోయారు. కాబూల్‌ నగరంలో భారీ సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ముఖ్యంగా కాబూల్‌లో తాలిబన్ల పెత్తనం మొదలయ్యాక జనం ఈ స్థాయిలో వీధుల్లోకి రావడం ఇదే మొదటిసారి. ఆఫ్ఘన్ల నిరసన ప్రదర్శనల్లో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాను తాలిబన్లు పూర్తిగా నియంత్రిస్తుండడంతో ఎక్కడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో  జనం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. తాలిబన్ల తీరుతో విసిగిపోయిన మహిళలు ధైర్యం చేసి గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించి వాటి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అంతర్జాతీయ సమాజానికి షేర్ చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి