
449views
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించి.. వారిపై ఆంక్షలు విధిస్తుంది. ఆ జాబితాను ఎప్పటికప్పుడు వివిధ దేశాలకు పంపిస్తుంది. వారు ఎక్కడున్నా.. వేటాడి బంధించాలని ఆదేశిస్తుంది. ఆ జాబితా ప్రకారం చూసుకుంటే.. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆ దేశ ప్రధాని సహా దాదాపు 14 మంది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నిషేధిత జాబితాలోని వ్యక్తులే. చాలామందిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు ఉన్నాయి.
డ్రగ్స్ మాఫియా, హత్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు వంటి హీనమైన చర్యలకు పాల్పడిన వారినే ఈ జాబితాలోకి ఐరాస చేరుస్తుంది. ప్రధానమంత్రి ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ నుంచి ప్రారంభిస్తే చివరకు ప్రావిన్స్ గవర్నర్ల కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నారు.





