502
ముంబయి: తొలి స్వదేశీ క్రూజ్ లైనర్ సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్‌వేస్ లీజర్ టూరిజానికి చెందిన కార్డెలియా క్రూజెస్ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో దీన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ సంస్థ దేశంలో ప్రీమియం క్రూజ్ లైనర్‌గా ఉంది.
గోవా, డయ్యు, లక్షద్వీప్, కోచి, శ్రీలంక తదితర ప్రాంతాలకు వీటిని నడపనుంది. ఈ నెల 18 నుంచి తొలి దశలో ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. 2022 మే తర్వాత చెన్నైకు క్రూజ్‌ను పంపించి అక్కడి నుంచి శ్రీలంక, కొలంబో, గాలే, ట్రింకోమాలీ, జాఫ్నా తదితర ప్రాంతాలకు పర్యాటక సేవలు అందిస్తామని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.