News

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… కూల్చిన భద్రతా దళాలు

605views

పంజాబ్​లోని భారత్- పాక్​ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్​ కలకలం చెలరేగింది. అనుమానాస్పదంగా ఉన్న ఓ డ్రోన్​ను సరిహద్దు భద్రతా సిబ్బంది కూల్చేశారు. ఈ ఘటన పంజాబ్​లోని తార్న్​తరాన్​ జిల్లాలో జరిగినట్టు అధికారులు తెలిపారు.
డ్రోన్ చక్కర్లు కొడుతుండడం గమనించిన వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు. దానిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే ఆ ప్రాంతంలో సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ డ్రోన్​ నుంచి ఎటువంటి పేలుడు పదార్థాలు, మరే ఇతర అనుమానిత వస్తువులు స్వాధీనం చేసుకోలేదని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి