
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సీజన్‌లో జరిగిన హింస, ఇతర నేరాలపై కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత నెల 25న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది.
నార్త్ 24 పరగణ జిల్లాలోని భట్పారా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అల్లర్లలో జూన్ ఆరోతేదీన ముగ్గురిపై కేసు నమోదు అయివుంది. నిందితుల్లో ఒకడు బాధితుడి ఇంటికి వెళ్ళి అతనిపై దౌర్జాన్యానికి పాల్పడి, వారి కుటుంబ సభ్యులను దూషించాడు. మరొక నిందితుడు బాధితుడి నుదిటిపై బాంబు విసిరాడు. ఆ బాంబు పేలుడు కారణంగా అతను మృత్యువాత పడ్డాడు. నిందితులపై తదుపరి విచారణ జరుగుతోంది.
రెండో కేసులో ఈ నెల రెండోతేదీన ఇద్దరు నిందితులపై న్యాయస్థానం ముందు సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. కోల్‌కతాలోని హోన్‌బ్లే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత నెల 28 కేసు నమోదు చేసింది. ఫిర్యాదుదారుడు నల్హాటి నుండి మాధురికి వెళ్తున్నాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కెనెల్ బ్యాంక్ రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలో ఒక వ్యక్తి పడి ఉన్నాడని అతనికి చెప్పారు. ఫిర్యాదుదారు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని జగధారి గ్రామానికి చెందిన వ్యక్తి మొయిజుద్దీన్ వరి పొలంలో చనిపోయినట్టు గుర్తించాడు. ఫిర్యాదుదారు నల్హతి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాంపూర్‌హాట్ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలావుండగా, గత నెల 31న నమోదైన కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు మొదలైన వాటిని రికవరీ చేయడానికి తొమ్మిది చోట్ల కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది.
ఈ కేసుతో పాటుగా, సీబీఐ ఇటీవల మరో రెండు కేసులను నమోదు చేసింది. ఎన్నికల సీజన్‌లో జరిగిన అల్లర్లపై సీబీఐ ఇప్పటివరకు 34 కేసులను నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.
SOURCE: vskbharat





