
-
ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే
గొప్ప సమాజం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం(ఆర్‌ఎస్‌ఎస్) పరితపిస్తోందని, సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సమాజం అమోదముద్ర వేసిందని ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు. దేశవ్యాప్తంగా 365 రోజుల పాటు ఒకటిన్నర లక్షలకు పైగా సేవా పనులు నిరంతరం నడుస్తున్నాయని చెప్పారు. హర్యాణాలోని రేవారి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రేవారి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమావేశంలో హోసబలే పాల్గొని, మాట్లాడారు.
సంఘ శాఖ సమాజం నుండి వచ్చిందని, సమాజం కోసం నిత్యం పనిచేస్తోందని హోసబలే అన్నారు. శాఖ అనేది మన భౌతిక, మేధో, సామాజిక అభివృద్ధిని అద్దంలా చూపుతుంది. మన శారీరక, మేధో వికాసంతో పాటు, సామాజిక దుర్మార్గాలను తొలగించడం, సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే, బలహీనతలను అద్దంలా చూపించడం ద్వారా, వాటికి పరిష్కార మార్గాలను కనుక్కొనేలా చేసి, పరిష్కరిస్తుందన్నారు.
దేశాన్ని బలోపేతం చేయడానికి కుటుంబాలను, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దత్తాత్రేయ హోసబలే అన్నారు. హర్యాణాలో కరోనా సమయంలో సంఘం, సమాజం చేసిన సేవా పనిని సమీక్షిస్తూ, భవిష్యత్‌లో కూడా మనం విపత్తుల్లో చురుకుగా, సురక్షితంగా, చక్కగా ప్రణాళికాబద్ధమైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. దీని కోసం స్వచ్ఛందంగా సమాజంలోని ప్రజలకు శిక్షణ ఇవ్వాల్సివుందన్నారు. ఈ క్రమంలో, హర్యానాలో 25,000 ఆరోగ్య మిత్రలను సిద్ధం చేస్తుందన్నారు. ఈ ఆరోగ్య మిత్రులు గ్రామం నుండి గ్రామానికి వెళ్లి ప్రజలకు సేవ చేస్తారన్నారు. ఇంకా, రేవారిలో రాగి పరిశ్రమ గురించి మాట్లాడారు.
ఇంకా, హర్యాణాలో సంఘ పని, పురోగతి, కరోనా సమయంలో మందగించిన శాఖలను వేగవంతం చేయడం గురించి కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సంఘ చాలక్ సీతారామ్ వ్యాస్, ప్రాంత్ సంఘచాలక్ పవన్ జిందాల్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగిసిన ఈ సమావేశంలో రేవారీ జిల్లా శాఖల నుండి 175 మంది పూర్ణ గణవేష్‌తో పాల్గొన్నారు.
SOURCE: Vskdevagiri





