News

కొత్త తరం విమానం హన్సా స‌క్సెస్

720views

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్‌ రీసెర్చ్-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR-NAL), బెంగళూరు వారు రూపొందించి, అభివృద్ధి చేసిన హంసా న్యూ జనరేషన్ (NG) విమానం, శుక్రవారం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) విమానాశ్రయం నుండి ప‌రీక్షించింది. ఇది విజయవంతమైంది. 4000 అడుగుల ఎత్తులోకి ఎగిరింది. సుమారు 20 నిమిషాల తర్వాత విజయవంతంగా ల్యాండింగికు ముందు హంసా విమానం 80 నాట్ల వేగాన్ని అందుకుంది. కాగా, కెప్టెన్ అమిత్ దహియా(టెస్ట్ పైలట్ ) ఈ తొలి విమానాన్ని నడిపాడు. గొప్ప‌ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

హన్సా-ఎన్‌జి ప్రత్యేకత‌లు

  • క్యాబిన్ సౌకర్యం, అధిక సామర్థ్యం కలిగిన డిజిటల్ కంట్రోల్డ్ ఇంజిన్
  • ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ఫ్లాప్స్, దీర్ఘ-సహనం
  • తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన గ్లాస్ కాక్‌పిట్, వ‌గైరా…

కాగా, విమానాన్ని టెలిమెట్రీలో సీనియర్ అధికారులు, DGCA, CEMILAC , CSIR-NAL నుండి శాస్త్రవేత్తలు/ఇంజనీర్లు పర్యవేక్షించారు. సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం (DSIR) , డైరెక్టర్ జనరల్, CSIR డైరెక్టర్ డాక్టర్ శేఖర్ సి మండే, NAL టీమ్‌ను అభినందించారు. CSIR-NAL ఇప్పటికే ఒక ప్రైవేట్ భాగస్వామిని గుర్తించిందని, సీరిస్ ప్రొడక్షన్ త్వరలో ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు, అదే సమయంలో హన్సా , టీమ్ NAL ప్రాజెక్ట్ డైరెక్టర్ అబ్బానీ రింకూ కృషిని ప్రశంసించారు.

SOURCE: NDTV

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి