News

ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం – సాగర రక్షణ వ్యవస్థపై సమీక్ష

622views

ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో ఈరోజు (సోమవారం) సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం భద్రత మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌ ఉండటంతో ఆయనకు ఈ అవకాశం వచ్చింది. యూఎన్‌ఎస్‌సీలో బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోడీయే కానున్నారు.

భద్రతామండలి సభ్య దేశాల నేతలు, ఐరాస అనుబంధ సంస్థలతో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉందని ప్రధాని కార్యాలయం తెలిపింది. సముద్ర నేరాలు, అభద్రతను సమర్థంగా ఎదుర్కోవడం, తీర ప్రాంతాల్లోని దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.