News

ప్రాణాలకు తెగించి..బావిలో పడిన గోవును కాపాడిన గ్రామస్తులు…

514views

కలిని తీర్చుకునేందుకు పంట పొలంలోకి చేరిన గోవు పచ్చని పైరును మేస్తూ ముందుకు సాగుతూ.. బావిలో పడిపోయింది. వెంటనే ఆందోళనతో అరవసాగింది. ఇది గమనించిన చుటుపక్కల రైతులు అక్కడికి చేరి దానిని రక్షించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

శ్రీకాకుళం రూరల్ మండలం గొల్లపేట గ్రామానికి చెందిన నీలంసెట్టి త్రినాథరావు అనే రైతు ఆవు.. మేత కోసం వెళ్లి ప్రమాదశాత్తు పొలంలోని బావిలో పడిపోయింది. అది గమనించిన రైతులు గ్రామానికి సమాచారం అందించారు. బావి వద్దకు చేరుకున్న రైతులు తాళ్లతో బయటకు లాగి దానిని కాపాడారు. అనంతరం గోమాతను పశు వైద్యుడి చూపించారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.