
ఆగస్టు 15 న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి పౌరులు తమ సమాచారాన్ని తనతో పంచుకోవాలని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థించారు. అలా చేస్తే ఎర్ర కోట యొక్క ప్రాకారాల నుండి ప్రజల ఆలోచనలు ప్రతిధ్వనిస్తాయని ఆయన అన్నారు.
దేశ పౌరులతో అనుసంధానించే వేదికైన ‘మై గవర్నమెంట్’ లో తమ తాము చెప్పదలచుకున్న విషయాన్ని తనతో పంచుకోవలసిందిగా ఆయన ఒక ట్వీట్ పేర్కొన్నారు.
ప్రధాని తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు మరియు విధానాలను వివరించనున్నట్లు పోర్టల్ పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాని మోడీ నేరుగా పౌరుల నుండే ఆలోచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నారు.
Your thoughts will reverberate from the ramparts of the Red Fort.
What are your inputs for PM @narendramodi’s speech on 15th August? Share them on @mygovindia. https://t.co/UCjTFU30XV
— PMO India (@PMOIndia) July 30, 2021
“అదేవిధంగా, ఈ సంవత్సరం కూడా నవ భారతం కోసం తమ సూచనలను అందించమని ప్రధాని పౌరులను ఆహ్వానిస్తున్నారు. కాబట్టి, ఇప్పుడు మీకు మీ ఆలోచనలను చెప్పడానికి, మీ సలహాలకు ఇవ్వడానికి, మీ దృష్టి కోణాన్ని స్పష్టీకరించటానికి మీకు అవకాశం ఉంది. గస్టు 15 నాటి తన ప్రసంగానికి ప్రజల అలోచనలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తీకరించనున్నారు.” అని ఆ ప్రకటన పేర్కొంది.
ప్రధాని కార్యాలయం ఈ ట్వీట్ చేసిన సెకన్ల వ్యవధిలోనే ప్రజలు తమ ఆలోచనలను పోస్టు చేయడం ప్రారంభించారు. పాఠశాల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి టీకాలు వేయడానికి ఒక మిషన్ ప్రోగ్రాంను ప్రకటించాలని.. జనాభా పెరుగుదల భారత్ కు అతిపెద్ద సమస్యగా మారుతోందని.. ఈ విషయంపై కూడా మాట్లాడాలని పలువురు కోరారు. ఇంకొన్ని సూచలను కూడా ప్రధాని మోడీకి చెప్పుకొచ్చారు నెటిజన్లు.





