News

రాజస్థాన్: బీజేపీ ఎస్సీ నేతపై దాడి చేసిన ‘రైతు నిరసనకారులు’

512views

రాజస్థాన్ శ్రీ గంగానగర్లో, ‘రైతు నిరసనకారులు’ అని పిలవబడేవారు బిజెపి నాయకుడు కైలాష్ మేఘవాల్ పై దాడి చేసి గాయపరచారు. సమాచారం ప్రకారం, నీటిపారుదల మరియు నీటి కొరతపై బిజెపి చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి మేఘ్వాల్ వచ్చారు.

దుస్తులు చింపి, దాడి చేసి….

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీడియోలలో, బిజెపి నాయకుడ్ని రైతు నిరసనకారులు చుట్టుముట్టి దాడి చేయడాన్ని చూడవచ్చు. బిజెపి నాయకుడిని రక్షించడానికి ఇద్దరు పోలీసు సిబ్బంది వస్తుండగా కొంత మంది వ్యక్తులు మేఘవాల్ ను నెట్టడమే కాకుండా ఆయన బట్టలు కూడా చించేశారు. ఆ దృశ్యాన్ని కూడా మనం వీడియోలో చూడవచ్చు.

BJP రాజస్థాన్ ప్రతినిధి ఈ సంఘటనను ఖండించారు. మేఘవాల్ బిజెపి ఎస్సీ మోర్చా నాయకుడని, ఒక దళిత నాయకునిపై దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ‘రైతు నిరసనల’ పేరిట మూక హింసకు పాల్పడటం ఖండించదగినదని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజస్థాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా ఆయన ఆరోపించారు.

Source : OPINDIA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.