News

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 647 ప్రదేశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న ABVP

947views

దేశం తన స్వాతంత్ర్య 75 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, అఖిల భారతీయ విద్యా పరిషత్ (ABVP) సాధారణ ప్రజలలో “జాతీయవాద భావాలను” రేకెత్తించడానికి దేశ రాజధానిలోని 647 ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది.

” ప్రధానంగా గ్రామాలు, వివిధ కాలనీలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం ఢిల్లీ ప్రజలలోనూ, దేశ ప్రజలలోనూ జాతీయ భావాలను వ్యాప్తి చేయడానికే ఈ ప్రత్యేక కార్యక్రమం రూపొందించామని” ABVP నాయకులు తెలిపారు. జమ్మూ-కాశ్మీర్‌లోని 3500 గ్రామాల్లో ఏబీవీపీ జాతీయ జెండాను ఎగురవేస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.