News

పుల్వామా అధికారి ఇంటిపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి

379views

మ్ముకశ్మీర్‌.. పుల్వామా ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అహ్మద్, ఆయన భార్య, కుమార్తె చనిపోయారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్ కుమార్తెను ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలోని హరిపరిగామ్ వద్ద ఉన్న ఎస్పీఓ అహ్మద్ ఇంటిలోకి ముష్కరులు చొరబడి.. ఆయన కుటుంబంపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో అహ్మద్ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రాజా బేగం, కుమార్తె ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను అధికారులు మోహరించారు. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.