News

బెంగాల్ లో 15 ఏళ్ల తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం

33views
బెంగాల్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో హిందువులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. బీజేపీ గెలవగానే అసన్ సోల్ లో 15 సంవత్సరాల తర్వాత దుర్గా ఆలయం తెరుచుకుంది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఘనంగా పూజలు నిర్వహించారు. అయితే అసన్ సోల్ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కృష్ణేందు ముఖర్జీ ఎన్నికల సమయంలో ఓ కీలకమైన వాగ్దానం చేశారు. తాము విజయం సాధించిన వెంటనే మూసేసి వున్న దుర్గా ఆలయాన్ని తిరిగి తెరిపిస్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ విజయం ఖరారైన వెంటనే ఎమ్మెల్యే కృష్ణేందు స్వయంగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం తాళాలు తెరిపించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ శ్రీ దుర్గా మాత ఛారిటబుల్ ట్రస్ట్ ఈ ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తుంది. స్థానిక వివాదాలు మరియు పరిపాలనాపరమైన ఆంక్షల కారణంగా, ఈ ఆలయం ఏళ్ళ తరబడి సామాన్య ప్రజలకు మూసివేయబడి ఉంది. గతంలో, దుర్గా పూజ మరియు లక్ష్మీ పూజ సమయాల్లో మాత్రమే ఇక్కడ చెప్పుకోదగ్గ కార్యకలాపాలు జరిగేవి. ఇకపై, ఈ ఆలయం భక్తుల దర్శనార్థం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది.
దుర్గా దేవీ ఆలయం తెరుచుకోగానే హిందువులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దుర్గా దేవీ నినాదాలు చేశారు. జై మాతాదీ.. జై మాతాదీ.. అంటూ నినాదాలు చేశారు. అందరూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.