
పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులు అందుకోవడం విశేషంగా నిలిచింది. . డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను విస్తృతంగా వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే, సుపర్ణాశర్మ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్, కామెంటరీ విభాగం కింద దీనిని ప్రకటించారు. ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్బెర్గ్కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్ తో కలిసి ఆనంద్, సుపర్ణ ఈ అవార్డును షేర్ చేసుకోనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా జర్నలిజం రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించే ఈ అవార్డు, సమాజానికి ప్రభావవంతమైన కథనాలు అందించిన వారికి ప్రదానం చేయబడుతుంది.
ఈ ఏడాది విజేతల జాబితాలో భారతీయ జర్నలిస్టులు కూడా చోటు దక్కించుకోవడం దేశానికి గర్వకారణంగా భావిస్తున్నారు. వారు చేసిన విశ్లేషణాత్మక కథనాలు, పరిశోధనాత్మక జర్నలిజం మరియు సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన విధానం ఈ గౌరవానికి కారణమయ్యాయి.





