514
దేశంలోని కొత్త ఐటీ చట్టంలోని డిజిటల్ మీడియా నిబంధనలను ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్ పాటించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలను ట్విటర్ పాటించడంలేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ అంశంపై తమ వైఖరి చెప్పాలంటూ కేంద్రంతో పాటు ట్విటర్‌కు ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ రేఖ పల్లి నోటీసులు జారీచేశారు. నూతన ఐటీ చట్టంలోని నిబంధనలను పాటిస్తున్నామని ట్విటర్ కోర్టుకు తెలిపింది. దీన్ని కేంద్రం తప్పు పట్టింది. ట్విట్టర్ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోంది విమర్శించింది. వాదనలను విన్న న్యాయమూర్తి.. కొత్త నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. తదుపరి విచారణ వాయిదా వేశారు.