344
పాకిస్తాన్‌లో నాలుగేళ్ల కిందట అడుగుపెట్టి బందీగా మారిన ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు.
నాలుగేళ్లు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ 2017లో పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే, ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని భారత్ కోరింది.
పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌పుర్‌లో ప్రశాంత్‌ను అప్పట్లో అరెస్టు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు.