News

ఆనందయ్య మందుకు హైకోర్టు పచ్చజెండా

507views

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు కూడా పచ్చజెండా ఊపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కంటిలో వేసే డ్రాప్స్‌పై గురువారంలోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఆనందయ్య మందుపై ఈరోజు ఉదయం, మధ్యాహ్నం హైకోర్టులో విచారణ కొనసాగింది. ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు కోరింది. ఈ విషయంపై ఇవాళ ప్రభుత్వం సమీక్ష జరుపుతుందని న్యాయవాది వివరించారు. చట్టప్రకారం ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఆనందయ్య తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరో దఫా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.