NewsSeva

కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను అక్కున చేర్చుకుంటాం – నంద్యాల సంఘమిత్ర సేవాసమితి

355views

ర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి 25 సంవత్సరములకు పైగా నిరాశ్రిత బాలురకు ఆశ్రయం కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం కోవిడ్ మహామ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎలాంటి ఆశ్రయం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులను ఆదుకోవడానికి, అక్కున చేర్చుకోవడానికి నంద్యాల సంఘమిత్ర సేవాసమితి తన ఆపన్నహస్తం చాస్తున్నది.

మన పరిసరాల్లో అలాంటివారు ఎవరైనా కనిపిస్తే సంఘమిత్రను సంప్రదించ వలసినదిగా సంఘమిత్ర యాజమాన్యం కోరుతున్నది.

సంఘమిత్ర సేవా తత్పరత, అంకితభావం దగ్గరనుండి గమనించి, ఆర్థిక, హార్థిక సహకారం అందించుటకు ముందు వరుసలో నిలుస్తున్న వదాన్యులకు సంఘమిత్ర నిర్వాహకులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.