News

కేరళ : బీజేపీ కార్యాలయంగా మారిన సీపీఎం కార్యాలయం

776views

తిరువనంతపురంలోని కోవళంలో సిపిఎం కార్యాలయం బిజెపి కార్యాలయంగా మారింది. విజింజంలో సిపిఎంకు చెందిన రెండు సిపిఎం శాఖా కమిటీలు నిన్న బిజెపిలో చేరాయి. దీనితో అక్కడ సిపిఎం ఖాళీ అయ్యింది. బీజేపీ లో చేరిన కార్యకర్తలు సిపిఎం కార్యాలయాన్ని కాస్తా బిజెపి కార్యాలయంగా మార్చారు. ఈ కొత్త కార్యాలయాన్ని బిజెపి జిల్లా అధ్యక్షుడు వివి రాజేష్ ప్రారంభించారు.

బెంగాల్ లో ఎలా అయితే సిపిఎం నుండి బిజెపిలోకి వలసల ప్రవాహం మొదలైందో, సరిగ్గా నిన్న కేరళలో అలాంటి దృశ్యమే కనిపించింది. కోవళం నియోజకవర్గంలోని విజింజంలో ఉన్న నెల్లికును, పనావిల శాఖా కమిటీల నాయకులు, కార్యకర్తలు మొత్తం బిజెపిలో చేరారు. బిజెపిలో చేరిన తరువాత విజింజంలో సిపిఎం కార్యాలయాన్ని బిజేపీ కార్యాలయంగా మార్చివేశారు. చేగువేరా పెయింటింగ్స్ పైన కమలం బొమ్మని వేశారు.

మాజీ కోవళ పంచాయతీ అధ్యక్షుడు ముకోలా ప్రభాకరన్ సహా మొత్తం 86 మంది సిపిఎం కార్యకర్తలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. సిపిఎం రాష్ట్ర నాయకత్వం యొక్క తప్పుడు విధానాలను నిరసిస్తూ వారందరూ రాజీనామా చేశారు.

విజింజం ఇంటర్నేషనల్ పోర్ట్ ప్రాజెక్ట్ ప్రాంతంలోని మొత్తం 20 మంది సిఐటియు కార్యకర్తలు బిజెపి సభ్యత్వం తీసుకున్నారు. DYFA యొక్క పాత ముఖం అయిన KSYF ద్వారా ప్రజా సేవలో ప్రవేశించిన ముకోలా జి ప్రభాకరన్ కూడా రాజధాని జిల్లాలో ప్రసిద్ధ సిపిఎం నాయకుడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.