తిరుమలలో ఘనంగా ముగిసిన పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు
తిరుపతి: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం గురువారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు...









