News

ముంబైలో శ్రీనివాసుడి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఏర్పాట్లు

446views

ముంబై: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుప్థాపన చేయనున్నట్టు మండలి ప్ర‌క‌టించింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, శ్రీవారి మెట్ల‌ మార్గంలో ఈ నెల అయిదోతేదీ నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు మండ‌లి ప్ర‌తినిధులు వెల్ల‌డించారు.

సర్వదర్శనం, స్లాట్‌ దర్శన టోకెన్లను కొనసాగిస్తామన్నారు. నడక మార్గంలో వచ్చే భక్తులకు త్వరలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తామని ఆయన తెలిపారు. బాలాజీనగర్‌లో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్‌ కోసం 2.86 ఎకరాలు ఆర్టీసీకి కేటాయించామన్నారు. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి