
502views
తిరుపతి: ప‌్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో అయిదేళ్ళ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. బాలుడు గోవర్దన్ రాయల్ దామినీడుకు చెందినవాడు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా కిడ్నాప్‌కు గురయ్యాడు.
ఈ సంఘటన నిన్న ఉదయం 5.45 గంటలకు చోటుచేసుకుంది. బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసిన తర్వాత తిరుపతికి బస్సులో వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. ఏపీ03జడ్0300 బస్సులో ఆ మహిళ ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Source: EtvBharat





