News

తిరుమలలో టైం స్లాట్ విధానం త్వ‌ర‌లో పున‌రుద్ధ‌ర‌ణ

556views

తిరుప‌తి: టైమ్‌స్లాట్‌ సర్వదర్శనాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. టోకెన్లు లేకున్నా నేరుగా వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తామని, ఏ విధానంలో వెళ్ళాలనేది భక్తుల అభీష్టమని వెల్లడించారు.

‘భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్లాటెడ్‌ విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. త్వరగా దర్శనం కావాలనుకుంటే టైమ్‌స్లాట్‌లో టోకెన్‌ తీసుకోవాలి. ఇందుకు అవసరమైన క్యూలైన్లు, షెడ్లతో కూడిన కేంద్రాలను శాశ్వత ప్రాతిపదికన తిరుపతి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌తోపాటు కొండకు వెళ్లే మార్గంలో ఆరు నుంచి ఎనిమిది ప్రదేశాల్లో త్వరలో అందుబాటులోకి తెస్తామ‌న్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి