News

శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి

448views

తిరుప‌తి: శ్రీ‌వారి మెట్ల‌ న‌డ‌క మార్గం పునఃప్రారంభ‌మైంది. ఈ మార్గంలో భ‌క్తుల‌ను తిరుమలకు అనుమ‌తించారు. కాగా, కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో శ్రీ‌వారి మెట్ల మార్గంలో మ‌ర‌మ్మ‌తులు చేశారు. ఈ మార్గం మీదుగా ప్ర‌తి రోజు ఆరు వేల మంది, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల్లో 15 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటార‌న్నారు. శ్రీ‌వారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీ‌నివాసుడు తిరుమ‌ల‌కు చేరుకున్న‌ట్లు, శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్టు శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌ని అధికారులు వివ‌రించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి