News

24 గంటల్లోనే నమీబియా చీతాల తొలివేట..!

321views

న్యూఢిల్లీ: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఫ్రెడ్డీ, ఎల్టోన్‌ అనే రెండిటిని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు. దీనిలోకి వెళ్లిన 24 గంటల్లోనే ఇవి తొలి వేటను పూర్తిచేశాయి. తొలుత ఈ చీతాల కండరాలు క్వారంటైన్లో బలహీనపడి ఉంటాయని అధికారులు ఆందోళన చెందారు. కానీ, ఇవి రెండూ ఆరోగ్యంగానే ఉన్నాయి. ఇవి ఆదివారం సాయంత్రం 6 గంటల సోమవారం ఉదయంలోగా ఓ మచ్చల జింకను వేటాడినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

మొత్తం 8 చీతాలను నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌ తీసుకొచ్చారు. వీటిని దాదాపు 50 రోజులపాటు క్వారంటైన్‌ చేశారు. అనంతరం వీటిల్లో రెండిటిని పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు. తాము ఊహించిన దానికంటే చాలా వేగంగా తొలివేటను పూర్తి చేసుకొన్నాయని అధికారులు వెల్లడించారు. శాటిలైట్‌ కాలర్స్‌, ఎన్‌క్లోజర్‌లోని కెమెరాలతో వీటి కదలికలను గమనిస్తున్నారు. మిగిలిన ఐదు చీతాలను కూడా త్వరలోనే పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి పంపే అవశాలున్నాయి. వీటిల్లో ఆశా అనే చీతా గర్భంతో ఉన్నట్లు భావిస్తున్నారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి