News

చర్చి ‘ఫాదర్’ అకృత్యాలు.. పోక్సో కేసు నమోదు, నిందితుడి అరెస్టు!

532views

అనకాపల్లి: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాధిత బాలిక దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు ఓ చర్చి ఫాదర్ కాగా, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి.. దిశ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ టి.లక్ష్మీ ఆదివారం తెలిపిన వివరాలివి. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలోని ఒక చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు(14, 17 ఏళ్లు). కొద్ది రోజుల నుంచి చిన్నకుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్నాడు.

ఇంట్లో తల్లి, సోదరి లేని సమయంలో ఏ అఘాయిత్యానికి ఒడిగడతాడోనన్న భయంతో బాలిక ఈ నెల ఒకటో తేదీన దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు అదే రోజు మధ్యాహ్నం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటన జరిగి ఆరు రోజులైనా వివరాలను మీడియాకు ఎందుకు వెల్లడించలేదని డీఎస్సీ మహేశ్వరరావును ప్రశ్నించగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం వల్ల వివరాలు వెల్లడించడానికి వీలు కాదని వివరణ ఇచ్చారు.

Source: andhrajyothi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.